అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

130
indrakaranreddy
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. మహంకాళిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వేదపండితులు, ఆలయ అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు తెల్లవారుజాము నుంచే బోనాలు సమర్పిస్తున్నారు. పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.

- Advertisement -