బోనాల ఉత్సవాలకు రండి.. సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం..

41
kcr cm

తెలంగాణలో బోనాల పండుగ ప్రారంభమైంది. గత కొన్నివారాలుగా బోనాల పండుగను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో భాగ్యనగరంలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు హాజరు కావాలంటూ సీఎం కేసీఆర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థానం తరఫున సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ సురిటి కామేశ్వర్, అసిస్టెంట్ కమిషనర్ గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ అర్చకులు ఉన్నారు.