రాజకీయ విభేదాలు శతృత్వంగా మారకూడదు: రమణ

43
ramana
- Advertisement -

రాజకీయ విభేదాలు శృతృత్వంగా మారకూడదన్నారు సీజేఐ రమణ. రాజస్థాన్‌ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ ఎన్వీరమణ… 75 ఏళ్ల పార్లమెంట్‌ ప్రజాస్వామ్యం అంశంపై ప్రసంగించారు.రాజకీయ వైరం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు.

భారత్‌ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని మనం గమనించాలని…. దేశ బహుళత్వాన్ని కాపాడుకోవడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక మార్గమని అభిప్రాయపడ్డారు. గతంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పరస్పర గౌరడం ఉండేదని… కానీ ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య దూరం పెరగడం దురదృష్టకరమన్నారు.

న్యాయ‌ వ్యవ‌స్ధలో ఖాళీల భ‌ర్తీ చేప‌ట్టక‌పోవ‌డంతోనే కేసులు ప‌రిష్కారానికి నోచుకోక పేరుకుపోతున్నాయ‌ని కేంద్ర ప్రభుత్వానికి చుర‌క‌లు వేశారు. న్యాయ‌మూర్తులుగా తాము విదేశాల‌కు వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతుంటార‌ని, ఓ కేసును ప‌రిష్కరించేందుకు ఎన్నేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అడుగుతుంటార‌ని చెప్పుకొచ్చారు.

- Advertisement -