తెలంగాణ మైనారిటీ స్కూళ్ల పని తీరు భేష్‌ : బీహార్‌ మంత్రి ఎండీ జమాఖాన్‌

49
tmeris
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మైనారిటీ స్కూళ్లను పరిశీలించిన బీహార్‌ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎండీ జమా ఖాన్‌. టీఎమ్‌ఆర్‌ఈఐఎస్‌ కార్యాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహమూద్ అలీ మరియు తెలంగాణ మైనారిటీ వ్యవహారాల సలహాదారు మరియు టీఎమ్‌ఆర్‌ఈఐఎస్‌ అధ్యక్షుడు A.K.ఖాన్ తదితరులు వారి వెంట ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యను అందించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ( టీఎమ్‌ఆర్‌ఈఐఎస్‌) ప్రధాన కార్యాలయాన్ని శనివారం సందర్శించిన జమా ఖాన్, తెలంగాణ మోడల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను అభినందించారు. టీఎమ్‌ఆర్‌ఈఐఎస్‌ విద్యార్థులకు అందించే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం మరియు హాస్టల్ సౌకర్యాలు వంటి వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ అభివృద్ధిలో ఈ పాఠశాలలను మైలురాయిగా ఉంటాయని అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో మైనారిటీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి విద్య రూపంలో విప్లవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కృషిని కొనియాడారు. తెలంగాణ సమాజాన్ని నిర్మించడంలో టీఎమ్‌ఆర్‌ఈఐఎస్‌ పెద్ద ప్రభావాన్ని చూపుతుందని, భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలు నెలకొల్పాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యపై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తునందుకు మంత్రి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -