- Advertisement -
.
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్…వన్డే సిరీస్‌ను దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇవాళ తొలి వన్డే జరగనుండగా స్టార్ ఆటగాడు కోహ్లీ దూరమయ్యాడు. విరాట్‌కు గజ్జల్లో గాయమైందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గాయం కారణంగా విశ్రాంతి అవసరం కావడంతో కోహ్లి తొలి వన్డేకు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కోహ్లి పేలవ ఆటతీరుపై మాజీలు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు విమర్శలు గుప్పిస్తుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన సహచరుణ్ని వెనకేసుకొచ్చాడు. వెస్టిండీస్ సీరిస్ మొత్తానికి కోహ్లిని రెస్ట్ తీసుకోవాలని మేనేజ్మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
- Advertisement -