- Advertisement -
భారీ వర్షాలతో నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. నాలుగు వేల మంది వరకు భక్తులను అధికారులు అనుమతించారు. పహల్గాంలోని నున్వాన్ బేస్ క్యాంపు నుంచి చందన్ వారి వైపు యాత్ర సాగుతోంది.
దర్శనం చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు వెళ్లబోమని, మంచు లింగాన్ని దర్శనం చేసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నామని భక్తులు చెబుతున్నారు. జూన్ 30న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభంకాగా గత శుక్రవారం నాటి వరదల కారణంగా అమర్‌నాథ్‌లో పదహారు మంది మరణించారు. దాదాపు 36 మంది వరకు గల్లంతయ్యారు. ప్రస్తుతం యాత్ర కొనసాగుతుండగా యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు, యాత్ర సజావుగా సాగుతుందని భావిస్తున్నట్లు అమర్‌నాథ్ యాత్ర కమిటీ తెలిపింది.
- Advertisement -