- Advertisement -
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంటిపై దాడులు నిర్వహించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. టెండర్ స్కామ్ వ్యవహారంలో సీఎం హేమంత్ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సీఎం సోరెన్‌పై ఇప్పటికే మైనింగ్ కుంభకోణం ఆరోపణలు రాగా ఈ వ్యవహారంలో ఈడీ గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది.
తాజాగా టెండర్ స్కామ్‌లో సాహెబ్‌గంజ్, మీర్జా చౌకీ, బెర్హత్, రాజ్‌మహల్ సహా మొత్తం 18 ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేస్తున్నారు. సీఎం సోరెన్ ప్రతినిధి పంకజ్ మిశ్రా ఇండ్లలోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
- Advertisement -