- Advertisement -
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ హస్తాన్ని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఆనంద్ శర్మ బీజేపీ అధినేత జేపీ నడ్డాను కలవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.
త్వరలో హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఆనంద్ శర్మ పార్టీని వీడుతుండటం కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే. అయితే తాను పార్టీ మారుతున్నాన్న వార్తలను ఆనంద్ శర్మ ఖండించారు. ఎప్పటికీ తాను కాంగ్రెస్ వాదినేనని స్పష్టం చేశారు. జేపీ నడ్డాతో భేటీకి రాజకీయ ప్రాధాన్యమేమీ లేదని వెల్లడించారు.
పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించాలని కోరుతున్న జీ-23 గ్రూప్‌లో ఆనంద్ శర్మ కూడా ఒకరు.
- Advertisement -