- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 18,930 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 35 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,66,739కు చేరగా 1,19,457 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
కరోనా నుండి 4,29,21,977 మంది కోలుకోగా ఇప్పటివరకు కరోనాతో 5,25,305 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతానికి చేరగా మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రికవరీ రేటు 98.53 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉండగా ఇప్పటివరకు 198.33 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
- Advertisement -