నిలకడగా లాలూ ఆరోగ్యం : ఆర్జేడీ

44
lalu prasad
- Advertisement -

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ ఆదివారం పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్‌లోని తన ఇంటి మెట్లపై నుండి పడిపోయారు. వారిని వెంటనే నగరంలోని పరాస్‌ ఆసుపత్రికి తరలించి చిక్సిత నిర్వహిస్తున్నామని తెలిపారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌. కుడి భుజం విరిగడం వలన కొంత విశ్రాంతి అవసరమన్నారు. ఆసుపత్రిలో 74 ఏళ్ల ఆర్జేడీ అధినేత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్జేడీ సీనియర్‌ నాయకుడు తెలిపారు.

బీహర్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పాట్నాలోని పరాస్‌ ఆసుపత్రిలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ను కలిసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆర్జేడీ అధికార ప్రతినిధి చిత్రరంజన్ గగన్ ప్రకారం, “ప్రధానమంత్రి మంగళవారం తేజస్వి యాదవ్‌తో మాట్లాడి ఆర్జేడీ అధినేత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్జేడీ అధినేత త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు”. అని ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -