తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు నటి శృతిహాసన్. టాలీవుడ్లో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది శృతి. ప్రభాస్తో కలిసి ‘సలార్’, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోండగా ఈ మధ్య ఆమె పోస్టు చేసిన వీడియో చిక్కులు తెచ్చిపెట్టింది.
తన వర్కవుట్ వీడియోను షేర్ చేసి తనకున్న హార్మోనల్ ఇష్యూస్ గురించి చెప్పుకొస్తూ.. తాను మానసికంగా ఎంతో ధృడంగా ఉన్నా, ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపింది. హార్మోన్ బ్యాలెన్స్ తప్పడంతో PCODతో బాధపడుతుంటానని తెలిపింది.
దీంతో పలు మీడియా ఛానల్లలో శృతి హాసన్ ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో జాయిన్ అయ్యిందని కథనాలు ప్రచురించారు. ఈ విషయంపై శ్రుతి ఫ్యాన్స్ ఆందోళన చెందుతుండటంతో, తాజాగా ఈ అంశంపై శ్రుతి స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది. తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తాను చాలా బాగున్నానని, ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్లో బిజీగా ఉన్నానని శ్రుతి ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంతో తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేసింది.