మాచర్ల నియోజకవర్గంలో అంజలి!

70
anjali
- Advertisement -

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.

ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ అప్‌డేట్‌ల‌ను షురూ చేసారు. తాజాగా ఈ చిత్రంలోని స్పెష‌ల్ సాంగ్ అనౌన్స్‌మెంట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ప్ర‌ముఖ న‌టి అంజలి ఈ పాట‌లో న‌ర్తించ‌నున్న‌ట్లు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నారు.

నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా న‌టించ‌నున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నితిన్ మొద‌టి సారిగా పూర్తి యాక్ష‌న్ సినిమాలో న‌టించ‌నున్నాడు.

- Advertisement -