దేశ్‌ కీ నేత సీఎం కేసీఆర్: యశ్వంత్ సిన్హా

81
yashwanth
- Advertisement -

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలో అభివృద్ధి పథంలో ముందుంచడం అది కేవలం కేసీఆర్‌ తోనే సాధ్యమైందన్నారు యశ్వంత్ సిన్హా. దేశానికి కేసీఆర్‌ లాంటి నేత అవసరమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అన్నారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ దగ్గర సమాధానం లేదన్నారు. ముఖ్యమంత్రితో మరోసారి సమావేశమవుతానని ఈ సందర్భంగా చెప్పారు. హైదరాబాద్‌ జలవిహార్‌లో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిథుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్‌ సిన్హా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ తనకు సంపూర్ణ మద్దతిస్తున్నందుకుగాను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కేసీఆర్‌ సవివరంగా చెప్పారు. తెలంగాణలో ప్రజా చైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దేశంలో పరిస్థితులు దిగజారిపొతుంటే చూస్తూ ఉండలేమన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం కాదు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటమన్నారు.


విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచిదికాదన్నారు. రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తుందని ఇది సమాజానికి మంచిది కాదన్నారు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్లమంది వినాలా? ఇదేనా ప్రజాస్వామ్యం? రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కూడా ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. ఇప్పుడు చేసే పోరాటం భారత్‌ భవిష్యత్‌ కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసే పోరాటమని యశ్వంత్‌ సిన్హా అన్నారు.

- Advertisement -