- Advertisement -
బంగారంపై కేంద్రం ఎక్సైజ్ సుంకం భారీగా పెంచడంతో పసిడి ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పటివరకు 10.75 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచడంతో ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,440 పెరిగి, రూ.51,957గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,690గా ఉంది.
ప్రస్తుతం దేశంలో బంగారం ఉత్పత్తి జరగడం లేదు. బంగారం కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్లే విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. అందువల్లే బంగారం దిగుమతిని తగ్గించాలనే ఉద్దేశంతో సుంకాన్ని పెంచాం అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
- Advertisement -