- Advertisement -
కొంతకాలంగా సీనియర్ నటుడు నరేష్ – నటి పవిత్ర మధ్య ఎఫైర్ ఉందని..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు పుల్ స్టాప్ పెట్టేలా క్లారిటీ ఇచ్చారు నరేష్.
పవిత్ర లోకేశ్ కు తనకు మధ్య ఉన్నది కేవలం స్నేహం అని ….హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగ్ లో ఆమె తనకు పరిచయం అయిందని, ఐదేళ్లుగా తమకు పరిచయం ఉందని తెలిపారు. ఇరువురి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయని కానీ రమ్య (నరేశ్ మూడో భార్య) వచ్చి ఇప్పుడు రచ్చ చేస్తోందని ఆరోపించారు.
పవ్రిత లోకేశ్ ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తనను సాధించాలని ప్రయత్నిస్తోందని ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని తెలిపింది. తనను వేధిస్తూ, బ్లాక్ మెయిల్ కు గురిచేసి డబ్బులు గుంజాలన్నదే ఆమె ప్రయత్నమని…ఇకనైనా రూమర్లకు పుల్ స్టాప్ పెట్టాలని సూచించారు.
- Advertisement -