కార్తీకేయ 2..లెటేస్ట్ అప్‌డేట్!

72
karthikeya 2
- Advertisement -

భిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ . గతంలో డైరెక్టర్‌ చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తీకేయ 2 వస్తోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీకృష్ణ తత్వంపై రెండో భాగం మరింత ఆసక్తికరంగా రూపొందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జూలై 22న థియేటర్స్‌లో విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ పార్టనర్స్ జీ5 (Zee 5) అని తెలుస్తోంది. సినిమా విడుదలైన తర్వాత దానికి వచ్చిన టాక్ ను బట్టి.. ‘కార్తికేయ 2’ చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదలయ్యేది ప్రకటించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి..

- Advertisement -