ట్విట్టర్‌కు కేంద్రం మరోషాక్!

85
Twitter
- Advertisement -

ట్విట్టర్‌కు కేంద్రం మరో షాకిచ్చింది. ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటిని తప్పక పాటించాల్సిందేనని ఇది ఫైనల్ నోటీసని తెలిపింది. ఇందుకు జూలై 4 వరకు గడువును విధించింది. గడువులోగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయని పక్షంలో ట్విటర్ మధ్యవర్తి స్థితిని కోల్పోతుందని కేంద్రం హెచ్చరించింది.

అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, రైతు ఉద్యమానికి మద్దతు పలికిన ట్విటర్‌ అకౌంట్లను, కొన్ని ట్వీట్‌లను బ్లాక్ చేయాలని 2021లో ప్రభుత్వం ట్విట్టర్‌ని కోరింది.

కేంద్రం ఆదేశాలతో 80కి పైగా ట్విటర్‌ అకౌంట్లను బ్లాక్‌ చేశామని ట్విట్టర్ తెలిపింది. ఆయా అకౌంట్లకు సంబంధించిన జాబితాను జూన్ 26న కేంద్రానికి సమర్పించింది. అయితే ఇంకా కొన్ని నిబంధనలను ట్విట్టర్ పాటించాలని ఈ మేరకు గడువు విధించింది కేంద్రం.

- Advertisement -