సీఎం పదవికి ఉద్దవ్ రాజీనామా..

31
maha
- Advertisement -

మహారాష్ట్రలో బలపరీక్షకు ముందే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేశారు ఉద్దవ్ ఠాక్రే. ఇవాళ మహా అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సి ఉండగా బల పరీక్షపై స్టే విధించడం కుదరదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆయన ఫేస్​బుక్​ లైవ్ వేదికగా మాట్లాడుతూ రాజీనామా ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు తీర్పుని తాను గౌరవిస్తున్నట్లు ఉద్దవ్ తెలిపారు.

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్​సీపీ చీఫ్​ శరద్​ పవార్​కు కూడా ఉద్ధవ్ కృతజ్ఞతలు తెలిపారు. శివసేన ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందన్నారు. తన రాజీనామాకు ముందు ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన మహారాష్ట్ర కేబినెట్‌ భేటీ అయింది. రెండు నగరాల పేర్లను మార్చుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. నవీముంబై ఎయిర్‌పోర్టు పేరును డీబీ పాటిల్‌ ఎయిర్‌పోర్టుగా మార్చుతూ ఠాక్రే కేబినేట్‌ ఆమోదించింది.

- Advertisement -