- Advertisement -
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం RC15(వర్కింగ్ టైటిల్). స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా ఇందులో కియారా అద్వానీ నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక తాజా సమాచారం మేరకు కొత్త షెడ్యూల్ ఈ జూలై 1 నుంచి అమృతసర్‌లో జరగనుంది. ఐదు రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుండగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తర్వాత హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరగనుంది.
ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. తండ్రి ముఖ్యమంత్రిగా… కొడుకు ఎన్నికల అధికారిగా మెప్పించబోతున్నారని టాక్. ఈ చిత్రానికి విశ్వంభర, అధికారి, సర్కారోడు, ఆఫీసర్ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
- Advertisement -