రాష్ట్రపతి అభ్యర్థి గా యశ్వంత్ సిన్హా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. పోయినవారం పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్‌లో ఎన్‌సీపీ నేత శరద్ పవార్ నేతృత్వంలో ప్రతిపక్షాలకు చెందిన 18 పార్టీల ప్రముక నాయకులు సమావేశమై యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించగా, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి గా యశ్వంత్ సిన్హా నేడు నామినేషన్ దాఖలు చేశారు.
యశ్వంత్ సిన్హా 1960 నుండి 1984 వరకు 24 సంవత్సరాలు ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. అనంతరం ఆ ఉద్యోగానికి రాజీనామ చేసి బీజేపీ లోకి చేరారు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో పదవులలో దేశానికి సేవలనందించారు. తరువాత 2021, మార్చి 13న తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మార్చి 15నుండి టీఎంసీ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన బాద్యతలు నిర్వహిస్తున్నారు.
పార్లమెంట్ భవన్‌లో జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్,ఎంపీ నామా నాగేశ్వర్ రావు, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,ఎన్‌సీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా,మల్లికార్జున్ ఖర్గే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో సహా తృణమూల్, శివసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.