‘సీతా రామం’ మెమరబుల్ మూవీ- దుల్కర్ సల్మాన్

114
Dulquer
- Advertisement -

దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా చిత్రం ‘సీతా రామం’. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న దత్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు హాజరైన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఈ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘సీతా రామం’ టీజర్ కి వండర్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకంటే వండర్ ఫుల్ గా సినిమా వుండబోతుంది. ‘సీతా రామం’ మెమరబుల్ మూవీ. అద్భుతమైన లోకేషన్స్ లో షూట్ చేశాం. దేశంలో చాలా ప్రదేశాలు చూసే అవకాశం దక్కింది, దర్శకుడు హను రాఘవపూడి, స్వప్న సపోర్ట్ కి కృతజ్ఞతలు. విశాల్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. సీతా రామం’ కథ గొప్పగా వుంటుంది. సినిమా విజువల్ వండర్ గా వుండబోతుంది” అన్నారు.

- Advertisement -