- Advertisement -
శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఆ పార్టీ నేత ఆదిత్యా ఠాక్రే. ఇప్పటికే శివసేన కార్యకర్తలు అంతా ఠాక్రే కుటుంబం వైపే ఉంటామని చెప్పగా తాజాగా రెబెల్ గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండేకు షాక్ ఇచ్చింది.పార్టీ పేరును, వ్యవస్ధాపకులు బాలాసాహెబ్ ఠాక్రే పేరును ఇతరులెవరూ వాడకూడదని సేన జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించింది.
రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని మరువలేమని ….ఈ పోరాటంలో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఎంవీఏ సర్కార్ సభలో మెజారిటీ నిరూపించుకోవాలని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) చీఫ్ రాందాస్ అథవలే సవాల్ విసిరారు.సేన కార్యకర్తలు రెబెల్ ఎమ్మెల్యేలను బెదిరించడం మానుకోవాలని హితవు పలికారు.
- Advertisement -