మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేనకు చెందిన మంత్రి ఏక్‌నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో ఉద్దవ్ నేతృత్వంలోని మహా వికాశ్ అవధి కూటమి మైనార్టీలో పడింది.
ఇది ఇలా ఉండగానే ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కరోనా బారిన పడ్డారు. దీంతో సంక్షోభంపై ఉద్దవ్‌తో చర్చించేందుకు కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. ఉద్దవ్ కరోనా బారిన పడ్డారని అందుకే ఆయన్ని కలవలేకపోయానని తెలిపారు కమల్ నాథ్. ఇక మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారికి కూడా కరోనా బారిన పడటంతో ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇక శివసేన మంత్రి షిండే క్యాంపు రాజకీయాల నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ సీఎం ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.