- Advertisement -
వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోగా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే విడుదలకు ముందు ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఇక తాజాగా దీనిపై వివరణ కూడా ఇచ్చింది సాయి పల్లవి.
అయితే తాజాగా ఈ సినిమాపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను బ్యాన్ చేయాలని… విశ్వ హిందూ పరిషత్ నేత కె.అజయ్ రాజ్ సుల్తాన్‌బజార్ పోలీసులకు పై ఫిర్యాదు చేశారు.
విరాట పర్వం సినిమా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉంది. పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇందులో చాలా అభ్యంతర మైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలి అని పేర్కొన్నారు.
- Advertisement -