తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయన్..

41
ujjal bhuyan
- Advertisement -

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ నియామకం అయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా వెళ్లనుండగా ఈ క్రమంలోనే హైకోర్టులో సీనియర్‌ జడ్జిగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయన్‌ ఇక్కడే సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు.

దీంతో పాటు పలువురికి స్ధానచలనం కలిగింది. ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ విపిన్‌ సంఘి ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు, బాంబే హైకోర్టుకే చెందిన జస్టిస్‌ ఎస్‌ఎస్‌.షిందే రాజస్తాన్‌ హైకోర్టుకు, బాంబే హైకోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి జస్టిస్‌ అహ్మద్‌ ఎ సయీద్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టుకు.. గుజరాత్‌ హైకోర్టుకు చెందిన జస్టిస్ రష్మిన్‌ ఎం.ఛాయ గౌహటి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు. వీరి పేర్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆధ్వర్యంలోని కొలీజియం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

- Advertisement -