తండ్రి బయోపిక్‌తో తనయుడు..

275
- Advertisement -

పూరితో బాలకృష్ణ 101వ సినిమా ప్రారంభమైంది. గౌతమి పుత్ర శాతకర్ణి ఘనవిజయం తర్వాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలయ్య సినిమా తెరకెక్కుతుంది. సినిమా ప్రారంభషూట్‌ కి దర్శకుడు రాజమౌళి క్లాప్ కొట్టారు.సినిమా ష్యూటింగ్‌ వేగంగా జరుగుతుంది.మరి బాలకృష్ణ రూట్ వేరు పూరీ స్కూల్ వేరు. బాలకృష్ణ సినిమాల్లో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా భారీ స్థాయిలో ఉంటుంది. పూరీ సినిమాల్లో హీరో సాధారణమైన కుర్రాడిగా కనిపిస్తుంటాడు. అందువలన వీరిద్దరి కాంబినేషన్ పై అంతా ఆసక్తిగా వున్నారు. ఎలాంటి కథతో రానున్నారా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.బాలయ్య ఈ సినిమా కంప్లీట్‌ కాక ముందే మరో మూవీ ప్లాన్‌లో ఉన్నాడు.

తన తండ్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్రను తెరకెక్కించాలనుకుంటున్నట్టు ఈ మధ్య బాలకృష్ణ చెప్పారు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా ఆయన సిద్ధం చేయిస్తున్నారు. ఎన్టీ రామారావును చాలా దగ్గరగా చూసింది .. ఆయనతో ఎన్నో సినిమాలు చేసింది దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు.

Balakrishna to make a biopic on father N T Rama Rao

ప్రస్తుతం దాసరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందువలన ఎన్టీ రామారావు బయోపిక్ కి సంబంధించిన సినిమా బాధ్యతను రాఘవేంద్రరావుకి అప్పగించాలని బాలకృష్ణ భావించారట. ఈ విషయంపై బాలకృష్ణ సంప్రదించగా, ఆయన సున్నితంగా తిరస్కరించారట. దాంతో మరో దర్శకుడి కోసం బాలకృష్ణ అన్వేషిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ బాధ్యతను ఆయన ఎవరికి అప్పగిస్తారో చూడాలి

- Advertisement -