రివ్యూ: విరాటపర్వం

274
rana
- Advertisement -

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా – సాయిపల్లవి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు ఇలా ప్రతీ అంశం సినిమాపై అంచనాలను పెంచేయగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరి ప్రేక్షకుల అంచనాలను విరాటపర్వం నిలబెట్టిందా లేదా చూద్దాం..

కథ:

విరాటపర్వం కథ 1990వ ప్రాంతంలో జరుగుతుంది. వెన్నెల (సాయి పల్లవి) కామ్రెడ్ అరణ్య అలియాస్ రవన్న (రానా) రచనలకు ప్రభావితం అవుతుంది. అతడిపై ప్రేమను పెంచుకుంటుంది. అయితే రవన్న కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తుంటారు. అలాంటి సమయంలోనే వెన్నెల కూడా ఇళ్లు వదిలి రవన్న కోసం ఊరురా తిరుగుతుంది. చివరకు రవన్న కలిసి దళంలో చేరుతుంది. అయితే దళంలో కోవర్టులున్నారని వెన్నెల మీద అనుమానంతో ఆమెను దళ సభ్యులే అంతం చేస్తారు..ఇదే విరాట పర్వం కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, నటీ నటులు,క్లైమాక్స్‌,దర్శకత్వం. రవన్న పాత్రలో రానా జీవించాడు. తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ఇక వెన్నెలగా సాయిపల్లవి నటన సూపర్బ్. తన పాత్రకు వందశాతం న్యాయం చేఏలా కన్నీరు పెట్టించింది. భారతక్కగా (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర), శకుంతల (నందితా దాస్) మిగతా పాత్రధారులైన ఈశ్వరీరావు, సాయి చంద్, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ, నివేదా పేతురాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా సెకండాఫ్ ప్రేమకు, విప్లవానికి జరిగిన సంఘటన, క్లైమాక్స్‌ సినిమాకై హైలైట్.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ అక్కడక్కడా సీన్లు కాస్త రిపీటెడ్‌గా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. . సురేష్ బొబ్బిలి పాటలు, ఆ జానపద గేయాలు, నేపథ్య సంగీతం అన్ని మనసును హత్తుకుంటాయి. రానా పాత్రకు సురేష్ బొబ్బిలి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. కెమెరాపనితనం, ఎడిటింగ్ బాగుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువలకు వంకపెట్టలేం. సున్నితమైన అంశాన్ని ఎంతో హృద్యంగా, గుండె బరువెక్కేలా అద్భుతంగా తెరకెక్కించాడు వేణు ఊడుగుల.

తీర్పు:

యథార్థ సంఘటన ఆధారంగా వేణు తెరకెక్కించిన చిత్రం విరాటపర్వం. దర్శకత్వ ప్రతిభ, రానా, సాయి పల్లవి నటన సినిమాకు ప్లస్ కాగా కొన్ని రీపిటెడ్ సీన్స్ మైనస్ పాయింట్స్‌. ఇక ముఖ్యంగా దర్శకుడు రాసిన మాటలు గుండెలను కదిలిస్తాయి. దళసభ్యులే అనుమానంతో కోవర్టు అని చంపినా దానికి దారి తీసిన కారణాలు, అనుమానం రావడానికి గల సంఘటనలను అద్భుతంగా తెరపై చూపించాడు. సెకండాఫ్ ప్రేమకు, విప్లవానికి జరిగే సంఘర్షణ, ఇక చివరలో క్లైమాక్స్‌ సినిమాను మరోస్ధాయికి తీసుకెళ్లింది. ఓవరాల్‌గా ఓ అందమైన ప్రేమకావ్యం.. విరాటపర్వం.

విడుదల తేదీ: 17/06/2022
రేటింగ్: 3/5
నటీనటులు: రానా, సాయిపల్లవి
సంగీతం:సురేశ్ బొబ్బిలి
నిర్మాత:సుధాక‌ర్ చెరుకూరి
దర్శకత్వం: వేణు ఊడుగుల

- Advertisement -