- Advertisement -
తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విచారణ నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టగా భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. అయితే కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లకుండా అన్ని మార్గాల్లో పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు.
దీంతో ఖైరతాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితలు నెలకొన్నాయి. యువజన కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే ఓ బైక్‌కు నిప్పు పెట్టారు. బస్సులను అడ్డుకుని నిరసనకు దిగారు. పలు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, గీతా రెడ్డి, అంజన్ కుమామార్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
- Advertisement -