త్వరగా కలెక్టర్‌ భవనాన్ని పూర్తి చేయాలి- మంత్రి

79
Minister Prashanth Reddy
- Advertisement -

బుధవారం మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణమవుతున్న కలెక్టర్ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. సెప్టెంబర్ నెలలో కలెక్టర్ భవనాన్ని పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు బిల్డింగ్ నిర్మాణం 70 శాతం పనులు పూర్తయ్యాయని మరో 30 శాతం పనులు వేగవంతంగా నిర్మాణం చేయాలని పేర్కొన్నారు.

కలెక్టర్ భవనంలోని ఒక్కొక్క బ్లాకు విడిగా పనులు చేపట్టి త్వరితగతిన భవనాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ బిల్డింగ్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. కార్యాలయంలో 35 డిపార్ట్ మెంట్‌లు ఒకే చోట ఉంటాయని ప్రజలు ఇక్కడనే అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. గోదావరి నదిపై అంతర్గాం మంచిర్యాల బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 164 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలోనే గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్,ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు,ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,మంచిర్యాల కలెక్టర్‌ భారతి హొల్లికేరి,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్,తెరాస యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -