పల్లె ప్రగతితో రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మారాయని…దేశానికే ఆదర్శంగా మన పల్లెలు నిలిచాయన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లెలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో తాగునీటి సౌకర్యంతోపాటు ట్రాక్టర్, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, రోడ్లు, డ్రైనేజీలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు.
ఉపాధి కల్పనలో దేశంలో తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతోపాటు ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు. నలుగురికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చేవారిని ప్రోత్సహిస్తామన్నారు. ఈ సందర్భంగా రూ.33 లక్షలతో నిర్మించిన ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు కేటీఆర్.