- Advertisement -
చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8084 మంది కరోన బారిన పడగా 10 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,32,30,101కు చేరగా, ఇందులో 4,26,57,335 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 47,995 కేసులు యాక్టివ్గా ఉండగా 5,24,771 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు 0.11 శాతానికి చేరగా రికవరీ రేటు 98.68 శాతం,మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతానికి చేరగా ఇప్పటివరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్ టీకాలు పంపింణీ చేశారు.
- Advertisement -