కొంతకాలంగా ప్రేమలో ఉన్న టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నయనతార-విగ్నేష్ శివన్ జూన్ 9న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరుగగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంగా మాడ వీధుల్లో చెప్పులతో నడవడం వివాదాస్పదమైంది.
అత్యంత పవిత్రంగా భావించే తిరుమల మాడ వీధుల్లో నయనతార, విగ్నేష్ చెప్పులు వేసుకొని తిరగడంతో భక్తులు, టీటీడీ సీరియస్ అయ్యారు. టీటీడీ ఈ విషయంలో కేసు నమోదు చేస్తామని తెలిపారు. అన్నివర్గాల నుండి విమర్శలు రావడంతో స్పందించారు నయన్ – విగ్నేశ్.
మాపెళ్లి తిరుమలలో జరగాలని కోరుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. చెన్నైలో మావివాహం జరిగిందన్నారు. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తితో పెళ్లి తరువాత ఇంటికి కూడా వెళ్లకుండా తిరుమలకు వచ్చామన్నారు. రెండవసారి వచ్చే కంగారులో పాదరక్షలు ధరించి రావడం జరిగింది. ఇందుకు మనస్ఫూర్తిగా మేమిద్దరం క్షమాపణ కోరుతున్నాం అని తెలిపారు.