20 ఏళ్ల జైలుశిక్ష లేదా జీవితఖైదు!

101
cp
- Advertisement -

హైదరాబాద్ జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశామని, వీరిలో ఒక్కరే మేజర్ అని తెలిపారు. మీడియాకు వివరాలను వెల్లడించిన ఆనంద్.. మైనర్లు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పేర్లు వెల్లడించడం లేదన్నారు.

వారందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని…ఆరో వ్యక్తి బాధితురాలిపై రేప్ చేయలేదన్నారు. బెంగళూరులో ఉంటున్న ఓ మైనర్.. స్కూల్స్ స్టార్ట్ కాకముందు పార్టీ చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం హైదరాబాద్ లో ఉన్న ముగ్గురు స్నేహితులను సంప్రదించాడు. అనంతరం ఆ ముగ్గురు సర్వే చేసి.. అమ్నేషియా పబ్‌ బాగుంటుందని.. ఏప్రిల్ నెలలో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఇక పార్టీలో బాధితురాలితో పాటు మరొక బాలికపై నిందితులు అసభ్యంగా ప్రవర్తించగా వారు బయటికి వచ్చారని చెప్పారు. ఇందులో బాధితురాలి స్నేహితురాలు వారి నుండి తప్పించుకుని వెళ్లిపోగా నలుగురు మైనర్లు.. బాధితురాలు మెర్సిడేజ్ కారు ఎక్కగా.. మిగతా వారు వేరే కారులో బేకరీకి వెళ్లారు.తర్వాత బాలికను ఇన్నోవా కారు ఎక్కించుకుని రోడ్ నెంబర్ 44 నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపి.. బాధితురాలిపై అత్యాచారం చేశారని చెప్పారు.

- Advertisement -