చీము నెత్తురు ఉంటే బీజేపీ నేతలు ఢిల్లీ పోయి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు తేవాలి మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఆయన ఈరోజు నారాయణ పేట జిల్లా కేంద్రంలో 390 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ఈ రోజు నారాయణ పేట్ లో 390 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం శంకుస్థాపన చేసుకోవడం శుభ దినం. తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్ల ఇది సాధ్యమైంది అన్నారు. నాగం జనార్ధన్ రెడ్డి, డీకే అరుణ ఇక్కడి నుండి మంత్రులుగా ఉన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ ఎవరు తెలీదు. కానీ ఇప్పుడు ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ లోనే మొత్తం 4 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరుగుతున్నది. 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు 3 కాలేజీలు ఏర్పాటు చేస్తే, సీఎం కేసీఆర్ 7 ఏళ్ళలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. నారాయణ్ పేటలో మెడికల్ కాలేజ్ వస్తుంది. మీ కోరిక మేరకు నారాయణ్ పెట్ లో ఈ విద్యా సంవత్సరంలోనే నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు డయాలసిస్ సేవలు అందేలా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసే టి డయాగ్నొస్టిక్ సెంటర్ ని ప్రారంభించాము. ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, టు డి ఏకో సేవలు కూడా ఇక్కడ అందుతాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటున్నారు మీకు బాగా తెల్సు. అక్కడ రైతులకు 6 గంటల కరెంట్ ఉందా. తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తుంది.బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు.. ఆపార్టీ ఇవ్వడం లేదంటే.. బీజేపీ ఫెయిల్, టీఆర్ఎస్ పాస్ అయినట్టే కదా అని మంత్రి చెప్పారు. 57 ఏళ్లకే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం మొదలు అవుతుంది. కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వబోతున్నమని అన్నారు.
మన వడ్లను కేంద్రం కొనలేదు..కానీ మేము కొంటున్నం. దీనికి అమిత్ షా సమాధానం చెప్పాలి, కర్ణాటకలో ఎందుకు కొనడం లేదు. కొనే దగ్గర ఎందుకు లోల్లి చేస్తున్నారు.. బండి సంజయ్ ఏం ముఖం పెట్టుకొని పాద యాత్ర చేస్తున్నారు. ఎలా వడ్ల కుప్పలా దగ్గరికి పోతున్నారు సమాధానం చెప్పాలని హరీశ్ మండిపడ్డారు. రాయచూర్‌లో కలుషిత నీరు తాగి ముగ్గురు చనిపోయారు, 300 మంది ఆసుపత్రి పాలయ్యారు. అది మీ పాలన అని ఎద్దేవ చేశారు. పాదయాత్ర చేస్తా అంటే ఎక్కడికక్కడ నిలదీయాలి. మీ రాష్ట్రాల్లో మీరు ఇచ్చే హామీలు అమలు చేసి మాట్లాడాలని అడగాలి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారం లేదు, ఇక అధికారంలోకి రావు. వాళ్లు అరచేతిలో వైకుంఠం చూపిస్తారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.
ప్రధాని ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ వంటి విభజన హామీలు ఎందుకు ఇవ్వరు. ఏపీ, కర్ణాటక, మధ్య ప్రదేశ్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు. మాకు ఎందుకు ఇవ్వవు అని ప్రశ్నించారు. 2014లో మోడీ అన్నాడు గెలిస్తే పాలమూరు పూర్తి చేస్తాం అని, 8 ఏళ్లు అయింది ఇంకా కాలేదు. గ్రామ పంచాయితీలకు డబ్బు ఇవ్వలేదా..? ట్రాక్టర్, ట్రాలీ, డంప్ యార్డులు, ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు ఎలా అయ్యాయి మరి అని హరిశ్ ప్రశ్నించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కోసం రు. 11,711కోట్లు చెల్లింపులు చేయడం జరిగింది. ఢిల్లీ నుండి రావాల్సిన సీ సీ రోడ్ల సొమ్ము మాత్రం పెండింగ్ లో ఉంది అని గుర్తు చేశారు. స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. గ్రూప్ 4, టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయి. స్థానికులకే అవకాశం లభిస్తుంది. వాటిని యువత ఉపయోగించుకోవాలి అని మంత్రి హరీశ్ సూచించారు.
మరిన్ని వార్తల కోసం..