బీజేపీ చెప్పింది తప్పయితే అమిత్ షా ముక్కు నెలకు రాస్తారా? అంటూ సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా కక్షపురితంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో అమిస్తాపూర్‌లో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రానికి తెలంగాణ రూ.3.65లక్షల కోట్లు ఇస్తే.. రూ.1.68లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని, తాను చెప్పింది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న కేటీఆర్.. బీజేపీ చెప్పింది తప్పయితే అమిత్ షా ముక్కు నెలకు రాస్తారా? అంటూ సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డికి ప్రధాని జాతీయ హోదా ఇస్తామని చెప్పారని, ఎనిమిదేళ్లలో ఒక్క పైసా ఇవ్వలేదని.. వికారాబాద్- కర్నాటక, గద్వాల- మాచర్లకు రైలు అడిగినా ఇవ్వలేదని మంత్రి ధ్వజమెత్తారు.
కృష్ణానదిలో తెలంగాణకు 575 టీఎంసీల నీటివాటా ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తుందని ఆరోపించారు. పాలమూరులో 8లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకనే పాలమూరులో వలసలు తగ్గాయని గుర్తు చేశారు. మంచి మంచి సంక్షేమ పథకాలతో పేదలకు ప్రభుత్వం అండగా ఉన్నదన్నారు మంత్రి కేటీఆర్. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కొట్లాడి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నిధులు తీసుకొచ్చారని, నియోజకవర్గంలో వెంకటేశ్వర్‌రెడ్డి 21 చెక్‌డ్యాంలు కట్టించారన్నారు మంత్రి కేటీఆర్.