తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు..

132
ik reddy
- Advertisement -

ఐదవ విడత పల్లె ప్రగతిలో భాగంగా నిర్మల్ జిల్లా మామడ మండలం గాయిద్ పల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన గ్రామంలో మొక్కలు నాటి గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నెలకు రూ.256 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పంచాయతీలకు రావలసిన రూ. 14 వందల కోట్లను మంజూరు చేయడం లేదన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని గ్రామంలో మిషన్ భగీరథ ప్రజలకు సురక్షితమైన నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుందని మంత్రి అన్నారు.. గ్రామంలో రూపాయలు 25 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, నూతన పాఠశాలను నిర్మిస్తామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయ లక్ష్మీ, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్, మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి,సర్పంచ్ రాథోడ్ రాందాస్,ఎంపిపి అమృత, మండల నాయకులు పాకాల చంద్ర శేఖర్, గంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -