- Advertisement -
బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీపై సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌లో అల్లూరి సీతారామరాజు ఫోటోను ఉంచారు. ఈ ఫోటోను కేంద్రమంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి తిలకించగా వాటిని షేర్ చేశారు టీఆర్ఎస్ నేత క్రిశాంక్.
దీనిని మంత్రి కేటీఆర్ రీ షేర్ చేస్తూ.. వాట్సాప్ యూనివర్సిటీలో శిక్షణ పొందడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే అని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ ఏకైక బలం అబద్ధాలు మాట్లాడటం, దాడులు చేయడమేనని కేటీఆర్ చెప్పారు. ప్రజాస్వామ్య పోరాట చరిత్ర లేని పార్టీ బీజేపీ… దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ, తెలంగాణ ఏర్పాటులోనూ ఆ పార్టీ పాత్ర లేదన్నారు.
- Advertisement -