- Advertisement -
బంగ్లా టెస్టు క్రికెట్ కెప్టెన్గా నియమితులయ్యారు ఆల్రౌండర్ షకీబల్ హసన్. నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం షకీబల్కిది మూడోసారి. లిటన్ దాస్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్లో ఓటమికి బాధ్యత వహిస్తూ మోమినుల్ హక్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.
2009లోనే తొలిసారి టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు షకీబుల్. జింబాబ్వేలో సిరీస్ ఓటమికి 2011లో తప్పించారు. ఆ తర్వాత 2017లో మరోసారి కెప్టెన్ అయిన షకీబల్పై 2019లో దూరం అయ్యారు. తాజాగా ఈనెలాఖరులో బంగ్లా జట్టు విండీస్ టూర్కు వెళ్లనుండగా షకీబుల్ని కెప్టెన్గా నియమించారు. బంగ్లా – విండీస్ మధ్య రెండు టెస్టులు జరగనున్నాయి.
- Advertisement -

