మంత్రి హరీశ్‌కు కవిత విషెస్

25
mlc kaivtha
- Advertisement -

రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత….హరీష్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు బావ‌…. ఆయురారోగ్యాల‌తో, నిండు నూరేళ్లు జీవించాల‌ని కోరుకుంటున్న‌ట్టు క‌విత పేర్కొన్నారు.

హ‌రీశ్‌రావు బర్త్ డే సందర్భంగా అభిమానులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. బర్త్ డే సందర్భంగా ఎవరికి అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. నా పట్ల మీకున్న‌ ప్రేమను సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంతున్నానని తెలిపిన హరీష్… మీ అభిమానానికి మరోసారి తల వంచి నమస్కరిస్తున్నన్నాను. మీరు చూపించే ఆదరాభిమానాలు, ప్రేమను గుండెల్లో పెట్టుకుంటాను అని తెలిపారు.

- Advertisement -