బ్రహ్మాస్త్ర.. ట్రైలర్‌ ఎప్పుడో తెలుసా?

107
ranabir
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త’. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఇందులో అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, నాగార్జున, మౌనీ రాయ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అప్‌డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందించారు మేకర్స్‌.

ఈ చిత్ర ట్రైలర్‌ను జూన్ 15న పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. రెండు భాగాలుగా రాబోతున్న ‘బ్రహ్మాస్త్రం’ మూవీ తొలి భాగానికి ‘‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ : శివ’’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, స్టార్ స్టూడియోస్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా సెప్టెంబర్ 9 న విడుదల కానుంది.

- Advertisement -