మోడీ డ్రీమ్ టీమ్‌లో ఫైర్‌ బ్రాండ్‌ చంద్రకళ..

265
Modi rewards firebrand IAS officer B Chandrakala
Modi rewards firebrand IAS officer B Chandrakala
- Advertisement -

“చుప్ రహో. గల్తీ ఆప్ లోగోంకీ హై. కమీషన్ ఖోరీకీ భీ హద్ హోతీ హై.. జైలుకు పంపిస్తా జాగ్రత్త…. ఇది ప్రజాధనం.. నీ ఇంటి సొమ్ము కాదు” అంటూ కనీస నైతిక విలువలు కూడా లేవా? అని రోడ్డు మీదే ప్రశ్నించిన ఒక డైనమిక్ ఐఏఎస్ చంద్రకళ కాంట్రాక్టర్ ల మీద విరుచుకుపడ్డ దృశ్యాలను టీవీల్లో చూసిన దేశం మొత్తం ఆమె గట్స్ కి సలాం చేసింది.

ప్రస్తుతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్ జిల్లా మెజిస్ట్రేట్‌గా ఉన్న చంద్రకళకు ఫైర్‌బ్రాండ్ అన్న ఇమేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ఫైర్‌ బ్రాండ్‌ ప్ర‌ధాని మోడీ డ్రీమ్ టీమ్‌లో చోటు సంపాదించారు. అప్పట్లో నాసిర‌కం రోడ్లు వేసిన కాంట్రాక్ట‌ర్లు, మున్సిప‌ల్ అధికారులపై ఆమె సీరియ‌స్ అయ్యారు. మెదటి నుంచి అక్రమార్కుల పాలిట కఠినంగా వ్యవహరించి నిజాయితీ గ‌ల ఆఫీస‌ర్ అన్న పేరు తెచ్చుకున్న‌ది. ఇప్పుడు ఆమెకు ప్ర‌ధాని మోడీ అరుదైన గుర్తింపు ఇచ్చారు. ప్ర‌ధాని మోడీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టిన స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌కు ఐఏఎస్ ఆఫీస‌ర్ చంద్ర‌క‌ళ‌ను డైర‌క్ట‌ర్‌గా నియ‌మించారు. మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాట‌ర్ అండ్ శానిటేష‌న్ శాఖ‌లోను ఆమెకు ఉప కార్య‌ద‌ర్శి బాధ‌త్య‌ల‌ను అప్ప‌గించారు. బులంద‌ర్‌షెహ‌ర్‌, బిజ్నూర్‌, మీర‌ట్ న‌గ‌రాల్లో క్లీన్ ఇండియా ప్ర‌చారాన్ని ఆమె స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించారు. ఐఏఎస్ చంద్రకళది చంద్రకళ కరీంనగర్ జిల్లా.. ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లి కి చెందినా లక్ష్మీ, కిషన్ నాయక్‌ల కుమార్తె.

ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్‌తో 2008లో సివిల్స్‌కి ఎంపికైంది. ట్రైనింగ్ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ జిల్లా పురాన్‌పూర్ ట్రైనీ ఆర్డివోగా బాధ్యతలు స్వీకరించింది. ఆ తర్వాత 2011లో అలహాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా.. 2012లో హమీద్‌పూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసింది. తరువాత మథుర కలెక్టర్‌గా పని చేశారు. మథురలో ఉన్నప్పుడే ఆమె ధాటికి తట్టుకోలేని అవినీతి అధికరులూ,కాంట్రాక్టర్లు అంత వణికిపోయేవారు.

- Advertisement -