ఆజాద్‌‌కు హ్యాండిచ్చిన కాంగ్రెస్!

64
azad
- Advertisement -

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌,మాజీ సీఎం గులాంన‌బీ ఆజాద్‌కు హ్యాండిచ్చింది కాంగ్రెస్. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ స్ధానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన కాంగ్రెస్…ఊహించ‌ని విధంగా ఆజాద్ పేరును ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు.

పది మంది పేర్లతో జాబితాను ప్రకటించగా త‌మిళ‌నాడు నుండి కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి, కర్నాటక రాష్ట్రం నుంచి జైరామ్ రమేశ్ ను బరిలోకి దింపింది. హర్యాణా నుంచి అజయ్ మకెన్, మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నేత ప్రమోద్ తివారీ, బీహార్ రాష్ట్రం నుంచి మాజీ ఎంపీ పప్పూ యాదవ్ సతీమణి రంజీత్ రంజన్, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ బంకా, ఛత్తీస్ గఢ్ నుంచి రాజీవ్ శుక్లాలను బరిలోకి దింపింది.

ఇక బీజేపీ 8 రాష్ట్రాల నుంచి 16 మందికి సీట్లు ఖరారు చేసింది. రాజ్యసభ ఎన్నికలు జూన్ 10వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే.

- Advertisement -