పేదల పెన్నిధి ఎన్టీఆర్‌- మంత్రి ఎర్రబెల్లి

37
errabelli
- Advertisement -

శనివారం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హనుమకొండలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ… విశ్వ విఖ్యాత నటుడిగా, ఆ తర్వాత పరిపాలకుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడు పేదల పెన్నిధి ఎన్టీఆర్‌. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారు ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచిన నేత వారి సేవలు చీర స్మరనియం.. వారి ఆశయాలను కొనసాగించడమే ఆయనకీ మనమిచ్చే ఘనమైన నివాళి అని మంత్రి కొనియాడారు.

- Advertisement -