- Advertisement -
హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతుండగా ఇక ఇదే ర్యాలీలో మతసామరస్యత వెల్లివిరిసింది. రాముడి విగ్రహాంపై పూలవర్షం కురిపించారు స్ధానిక ముస్లింలు. భిన్నత్వంలో ఏకత్వాన్ని మరోసారి చూపించారు.
శోభాయాత్రలో రాముడు, హనుమాన్ విగ్రహాలను ప్రధాన రహదారుల గుండా ఊరేగించారు. ఈ యాత్ర రాజీవ్ చౌక్ వద్దకు చేరుకోగానే.. ముస్లింలు బిల్డింగ్ పైనుంచి రాముడి విగ్రహంపై పూల వర్షం కురిపించారు. ఈ దృశ్యం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
ఇక తెలంగాణ అంటేనే మతసామరస్యానికి ప్రతీక. గతంలో గణేష్ నిమజ్జన శోభయాత్రతోపాటు పలు హిందువుల పండుగల సందర్భంగా ముస్లీం సోదరులు సేవా కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే హిందువులు కూడా రంజాన్ తోపాటు ముస్లీం పండుగలకు శుభాకాంక్షలు తెలుపుతుంటారు.
- Advertisement -