జమ్ముకశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదును విధించింది. ఉగ్రవాదులకు, సంఘ విద్రోహ శక్తులకు నిధులు అందించారనే కేసులో శిక్షను ఖరారు చేసింది. యాసిన్ మాలిక్ కు ఉరిశిక్ష విధించాలని కోర్టును ఎన్ఐఏ కోరింది. ఇదే సమయంలో శిక్షను విధించేటట్టయితే జీవిత ఖైదును విధించాలని డిఫెన్స్ లాయర్లు కోర్టును విన్నవించారు. ఇరుపక్షాల వాదలను విన్న కోర్టు… ఈరోజు శిక్షను వెలువరించింది. యాసిన్ కు జీవిత ఖైదును విధించింది. కేవలం యావజ్జీవ శిక్ష మాత్రమే కాదు.. 10 లక్షల రూపాయల జరిమానా కూడా కోర్టు విధించింది. రెండు జీవిత ఖైదులతో పాటు.. 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. వీటితో పాటు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు అని న్యాయవాది ఉమేశ్ శర్మ ప్రకటించారు.
కోర్టు వాదనలు జరుగుతున్న సమయంలో యాసిన్ మాలిక్ మాట్లాడారు. తాను క్రిమినల్ అయితే.. అటల్ బిహారీ వాజ్పాయ్ ప్రభుత్వం తనకు ఎందుకు పాస్పోర్ట్ ఇచ్చిందని ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యటించడానికి ఎందుకు అనుమతి ఇచ్చిందని కూడా ప్రశ్నించారు. తాను గాంధీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నానని, కశ్మీర్ లోయలో అహింసతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని వాదన సమయంలో మాలిక్ చెప్పుకొచ్చారు.