ఫేస్‌బుక్, ట్విట్టర్‌లోనే బీజేపీ!

70
arjun singh
- Advertisement -

బీజేపీ కేవలం ఫేస్‌బుక్, ట్విట్టర్‌లోనే ఉంటుందని… సోషల్ మీడియా ద్వారా రాజకీయం చేయడం కుదరదన్నారు ఎంపీ అర్జున్ సింగ్. బెంగాల్‌ నుండి కాషాయ పార్టీ తరపున గెలిచిన అర్జున్‌సింగ్ ఆ పార్టీని వీడి టీఎంసీలో చేరారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో అర్జున్ సింగ్ పార్టీ జెండా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. తాను ఎంపీగా ఎన్నికైన ప్రాంతంలో జూట్లు ఎక్కువగా ఉంటారని, కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాళ్ల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కేంద్ర విధానాల వల్ల జూట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

బీజేపీ నాయకులు ఏసీ రూముల్లో కూర్చోవడం వల్ల ప్రజల్లో విలువ కోల్పోతున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు టీఎమ్‌సీ ప్రయత్నిస్తోందని తెలిపారు. 2019లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు అర్జున్ సింగ్. ఇక మూడేళ్ల తర్వాత తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.

- Advertisement -