అబద్ధాలకు ప్రతిరూపం అరవింద్- ఎమ్మెల్సీ కవిత

58
mlc kavitha
- Advertisement -

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అబద్ధాలకు ప్రతిరూపమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. శనివారం జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లిలో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కవిత అరవింద్‌పై మండిపడ్డారు. పనిచేయ చేతగాదు కానీ అబద్ధాలు చెప్పుకుంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అబద్ధం వెళ్లి అద్దంలో చూసుకుంటే అరవింద్‌ కనిపించాడంటా అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో గెలిచినవాళ్లకు మర్యాద ఇవ్వాలని.. అందుకే అరవింద్‌కు మూడేండ్లు అవకాశం ఇచ్చామన్నారు. అయినా రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ చేసిన పనులను కూడా తామే చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని కవిత వెల్లడించారు.

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి బీజేపీని ఎందుకు విమర్శించరని కవిత ప్రశ్నించారు. పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై ఎందుకు విమర్శించరని, ఇరు పార్టీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందేమోనని సందేహం వ్యక్తంచేశారు. కాంగ్రెసోళ్లు గ్రామాలకు వస్తే ప్రకృతివనాలు, డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు చూపించాలన్నారు. తెలంగాణకు రావాల్సిన బకాయిలపై పార్లమెంటులో మాట్లాడాలని రాహూల్‌ను జీవన్‌రెడ్డి కోరాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు.

- Advertisement -