ఆఫీస్ స్పేస్ లీజులో హైద‌రాబాద్ టాప్- కేటీఆర్‌

77
- Advertisement -

ఐటీ రంగంలో తొలి స్థానంలో ఉన్న బెంగ‌ళూరును దాటేసి ఆ స్థానంలో హైద‌రాబాద్‌ను నిల‌పాల‌న్న క‌సితో తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎంతో శ్ర‌మిస్తున్నారు. ఐటీ రంగంలో బెంగళూరు, హైద‌రాబాద్‌ల మ‌ధ్య చాలా కాలం నుంచే పోటీ వాతావ‌ర‌ణం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా దానిని మంత్రి కేటీఆర్ వ‌ద‌ల‌డం లేదు. ఈమేరకు ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో శ‌నివారం ఓ క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. ఆఫీస్ స్పేస్ లీజులో బెంగ‌ళూరు న‌గ‌రాన్ని దాటేసిన హైద‌రాబాద్ ఈ విభాగంలో టాప్ పొజిష‌న్‌లోకి దూసుకెళుతోందంటూ ఆ క‌థ‌నంలో పేర్కొంది.

ఈ అంశంపై మంత్రి కేటీఆర్ శ‌నివారం ఓ ట్వీట్ చేశారు. ఆఫీస్ స్పేస్ లీజులో హైద‌రాబాద్ స‌త్తా చాటుతున్న‌ద‌ని పేర్కొన్న కేటీఆర్‌… అందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా ప్ర‌స్తావించారు. త‌క్కువ అద్దెలే ఆఫీస్ స్పేస్ లీజుల్లో హైద‌రాబాద్‌ను అగ్ర స్థానానికి తీసుకెళుతున్నాయ‌ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -