రాజశేఖర్ హీరోగా పాన్‌ ఇండియా మూవీ!

42
shekar
- Advertisement -

శేఖర్ తర్వాత పెద్ద దర్శకుడితో మంచి కాంబినేషన్ లోనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు హీరో రాజశేఖర్. శేఖర్ సినిమా రిలీజ్ సందర్భంగా జర్నలిస్టులతో చిట్ చాట్‌గా మాట్లాడిన రాజశేఖర్..కోవిడ్ తో బాధపడుతూ ఐసియు లో వున్నప్పుడు టివి లో వచ్చే డాన్స్ ఫైట్ సీన్స్ చూసి నేను ఇలా డాన్స్, ఫైట్స్ చేసే వాన్ని ఇలా అయిపోయాను కదా అని ఇక నా జీవితం అయిపోయింది నేను సినిమాకు పనికిరాను “జోసఫ్” సినిమా ఎవరికైనా ఇచ్చేయ్ అనే స్టేజ్ కు వెళ్ళాను అన్నారు.

ఇంతవరకు నా వెనక ప్రాపర్టీ ఉండేది.ఇప్పుడు అవన్నీ అప్పుల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయితేనే నేను అప్పుల నుంచి బయటపడతాను. అందుకే నేను ఎప్పుడూ లేని టెన్షన్ తో నా మనసులో నుంచి వచ్చిన మాట తో నన్ను, నా సినిమాను బతికించండి అని ప్రి రిలీజ్ ఫంక్షన్లలో చెప్పానని తెలిపారు. ఆడియన్స్ ఎదురు చూసేలా ఒక డిఫ్రెన్స్ ఫిల్మ్ ఇవ్వాలని డీఫ్రెంట్ ఫిల్మ్ ను చూజ్ చేసుకొని వచ్చాను. ఈ సినిమా లో ఒక ఆర్టిస్ట్ గా చాలా శాటిస్ఫై అయ్యాను ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో ఉన్న ఎమోషన్, ఆ పరిస్థితి క్యారెక్టర్లో చూపిస్తూ ప్రేక్షకులకు చాలా విషయాలు అర్థం అవ్వాలి. శేఖర్ ఎ మ్యాన్ విత్ ద స్కార్ అని ఉంది.ఆ స్కార్ తో ఉన్న వాడు ఎలా ఉండాలి అన్నట్టు ఈ క్యారెక్టర్ ఉండాలన్నారు.

నా గెటప్ కోసం 55 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ వుండే ఈ క్యారెక్టర్ కు కొత్త లుక్ ఉంటే ఈ సినిమానే డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది.దీంట్లో కొత్త లుక్ ఉంటే సినిమాకు ప్లస్ అవుతుంది అని ఆలోచించి సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ వేశామన్నారు. ఆ గెటప్ వేసి షూటింగ్ చేసినప్పటి రోజు నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఈ గెటప్ సూపర్ గా ఉంది అని చెప్పడంతో నాకు ఈ సినిమా పై చాలా కాన్ఫిడెన్స్ వున్నా కూడా ఎక్కడో భయం ఉండేది. అయితే మొన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందన్నారు.

జీవిత ఈ సినిమా సెన్సార్ కొరకు వెళ్ళినప్పుడు వారు ఈ సినిమా చూసి చాలా మెచ్చుకున్నారు. దాంతో మాకు ఇంకా ధైర్యం వచ్చింది.దాంతో మేము ఈ సినిమాను కొంతమంది మా క్లోజ్ ఫ్రెండ్స్ కు ఈ సినిమా చూపించడం జరిగింది.వారు సినిమా చూసిచాలా బాగుందని చెప్పడం జరిగింది . జీవిత,నేను సెట్లో వున్నప్పుడు తను ఒక డైరెక్టర్ గా, నేను ఆర్టిస్ట్ లాగే ఉంటాము.అయితే షూటింగ్ తర్వాత ఇద్దరూ క్యారెక్టర్ కోసం అప్పుడప్పుడూ డిస్కషన్ చేసుకుంటాం. తను నాతో బంగారం ఈ క్యారెక్టర్ లో నువ్వు ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అక్కడ తగ్గిస్తే బాగుంటుందని డైరెక్షన్ చేపిస్తుంది. జీవిత చాలా మంచి డైరెక్టర్ అందరి దగ్గర బాగా పని తీసుకుంటుంది. ప్రతి సీన్ పండిస్తుంది అందులో ఫీల్ ను సోల్ ను చెడగొట్టకుండా చాలా చక్కగా తీస్తుంది.

నా సినిమాలన్నీ కూడా తలంబ్రాలు, ఆహుతి, అంకుశం మగాడు, మా అన్నయ్య, సింహరాశి, మా ఆయన బంగారం, ఇలా నా సినిమాలన్నీ రీమేక్ సినిమాలే.. రీమేక్ లో తీసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అయ్యాయి అయితే ఒక్క “శేషు” మాత్రం పెద్ద సక్సెస్ కాలేదంటే దాని ఇమేజ్ తక్కువ చేశాము. అయితే టీవీ లో మాత్రం హిట్ అయ్యింది. జోసెఫ్ మలయాళం లో సక్సెస్ అయ్యింది. మలయాళంలో సక్సెస్ అయిన సినిమాలు చాలా చేశాను.రీమేక్ చేస్తే మనకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది అన్న అడ్వాంటేజ్ ఉంటుంది రీమేక్ లో అందుకే జోసెఫ్ ను సెలెక్ట్ చేయడం జరిగింది.అలాగే నేను ఎం చెయ్యాలో నా క్యారెక్టర్ కూడా నాకు ముందే తెలిసి ఉంటుంది కాబట్టి నటుడిగా నాకు ఈజీ అవుతుంది.

జోసఫ్ సినిమాతో శివానీ, శివాత్మిక ఇద్దరికీ బిగినింగ్ మంచి పేరు వచ్చింది.శివాత్మిక దోరసాని సినిమా చేయడం. శివాని టూ స్టేట్స్ సగం వరకు అయ్యింది తర్వాత శివాని సినిమా అద్భుతం, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ రిలీజ్ అయిన అందరూ మెచ్చుకున్నారు. అలాగే శివాత్మిక కృష్ణవంశీ గారితో రంగమార్తాండ సినిమా చేస్తుంది. ఆ సినిమాలో ఉన్న బ్రహ్మానందం, కృష్ణవంశీ, ప్రకాష్ రాజు, రమ్య కృష్ణ వీరంతా నాకు ఫోన్ చేసి మీ ఆమ్మాయి చాలా బాగా చేస్తుంది అని మెచ్చుకున్నారు నాకు చాలా హ్యాపీ వేసింది.

ఈ సినిమాలో కూతురి పాత్రకు శివాని, శివాత్మక ఇద్దరినీ వద్దు అన్నాను. జీవిత లేదు మన ఇద్దరిలో ఒకరిని పెడితే ఆడియన్స్ కు కూతురు స్ట్రెస్ చేయడానికి మనకు ఎక్కువ టైం పట్టి ఎక్కువ సీన్స్ చేయాల్సి వస్తుంది. మన కూతురు అయితే ప్రేక్షకులకు చూడడానికి బాగుంటుంది అని చెప్పింది. దాంతో ఈ సినిమాలో ఎవరు చేస్తారు అని ఇద్దరినీ అడగడం జరిగింది శివాత్మిక అక్క కోసం త్యాగం చేసి ఈ సినిమా శివాని కి ఇవ్వడం జరిగింది

నా 37 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో 27 సంవత్సరాలు సాయి కుమార్ గారు నాకు వాయిస్ చెప్పడం జరిగింది. అయితే మధ్యలో పది సంవత్సరాలు శ్రీనివాస్ మూర్తి గారు చెప్పడం జరిగింది మళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో నాకు సాయి కుమార్ గారి వాయిస్ చెప్పడం జరిగింది.అయితే ఎవరు చెప్పినా ఆడియన్స్ గుర్తుపట్టని విధంగా వాయిస్ చెప్పడం జరిగింది .

కోవిడ్ టైమ్ లో నాది చాలా బ్యాడ్ స్విచ్వేషన్స్ డెత్ బెడ్ నుండి తిరిగి వచ్చి డెబ్భై ఐదు కేజీల నుంచి అరవై మూడు ల్కేజీల కి వచ్చాను. ఐసియు లో నాకు బోర్ కొట్టకుండా నాకు టీవీ పెట్టారు ఆ టీవీ లో హీరోలు డాన్స్ ఫైట్ సీన్స్ చూసి నేను ఇలా డాన్స్, ఫైట్స్ చేసే వాన్ని ఇలా అయిపోయాను కదా అని ఏడ్చాను. జీవితతో నా జీవితం అయిపోయింది నేను సినిమాకు పనికిరాను “జోసఫ్” సినిమా ఎవరికైనా ఇచ్చేసేయ్ లెట్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు అని చెపితే.. ఎం కాదు మీరు కోలుకుంటారుఅని జీవితం నాకు మోటివేషన్ చేస్తూ వచ్చింది. అయితే సినిమాపై ఉన్న కసితో నేను మెల్లమెల్లగా కోలుకొని ఈ సినిమాను కంప్లీట్ చేయడం జరిగింది

ఒరిజినల్ వెర్షన్ కి ఈ సినిమాకు పెద్ద చేంజెస్ అంటే ఏమి ఉండవు చిన్నచిన్న మార్పులు ఉంటాయి మలయాళంలో అంటే లో ఫేస్ ఉంటుంది తెలుగులో పుట్టకళ్ళ ఫేస్ పెంచుకుంటాను కానీ తమిళులకి మనకు ఏమీ తేడా ఉండదు చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి కొన్ని ఎక్స్ప్లనేషన్ ఇవ్వకుండా ఉన్న వాటిని తెలుగు ఆడియన్స్ తగ్గట్టు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది

ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్.. అనూప్ రూబెన్స్ మ్యాజిక్ చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కచ్చితంగా స్మోక్ చెయ్యాలి.మ్యూజిక్ కు స్మోక్ ముడిపడి ఉంటుంది.కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత నన్ను స్మోక్ చేయకూడదని డాక్టర్లు చెప్పారు. నువ్వు స్మోక్ చేస్తే మీ లంగ్స్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ డేంజర్ లోకి వెళ్ళిపోతారని చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కానీ నా క్యారెక్టర్ స్మోక్ చేయకపోతే సినిమా ఎఫెక్ట్ ఉండదు.అయితే ఈ సినిమాపై కసి, పిచ్చి వల్ల నేను ఏమైనా పర్వాలేదు ఈ సినిమా బాగా రావాలి హిట్ అవ్వాలి అని మళ్లీ స్మోక్ చేసి సినిమా చేశాను

నా తమ్ముడికి ఇద్దరు కొడుకులు వాడు చెన్నై లో ఉంటాడు. వాడు నాతో నువ్వు ఈ రోజు రికవర్ అయ్యి ఈ పొజిషన్ లో ఉన్నావు అంటే దానికి కారణం నీ కూతుల్లే.. మీ ఇద్దరు కూతుర్లు నిన్ను కాపాడారు అది బాగా గుర్తు పెట్టుకో ఎందుకంటే వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు.నా కొడుకులు మాత్రం నన్ను సరిగా చూసుకోవడం లేదు అన్నాడు. అయితే నా తమ్ముడు చెప్పినట్లు నా పిల్లలు, జీవిత నన్ను చాలా బాగా చూసుకున్నారు.వారు ఇంటికి కూడా వెళ్లకుండా నా కోసం హాస్పిటల్ ఐసియు లోనే కాపురం చేస్తూ నన్ను అంత బాగా చూసుకున్నారు.అప్పుడే నాకు అనిపించింది.కూతుర్లు చాలా రెస్పాన్సిబులిటీ గా ఎఫెక్టివ్ గా ఉంటారు అని.కానీ నేను కొడుకులు తక్కువ అని చెప్పడం లేదు కూతుర్లు ఎక్కువ అని ఫీల్ అయ్యాను

దొరసాని దర్శకుడు మహేందర్ మా ఫ్యామిలీ లోని నలుగురిని పెట్టి ఒక సినిమా తీయాలని అనుకున్నారు.కొన్ని కరెక్షన్స్ చేయాలని అనుకుంటున్నాం. అలాగే ప్రవీణ్ సత్తారు గరుడవేగ పార్ట్ 2 లో మీ కూతుళ్లను కూడా యాడ్ చేద్దామని అన్నారు.దర్శకుడు సుకుమార్ గారు నా గురించి ప్రి.రిలీజ్ ఈవెంట్ లో అలా చెప్పడం చాలా సంతోషం అనిపించింది.ఈ విషయం నాకు ఇన్ని రోజులు తెలియలేదే అని బాధపడ్డానని చెప్పారు.

- Advertisement -