ఓటీటీలో ‘అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం’!

132
ashoka vanamlo
- Advertisement -

తొలి చిత్రం ఈ న‌గ‌రానికి ఏమైందిలోనే త‌న మార్క్‌ను క్రియేట్ చేసిన న‌టుడు విశ్వ‌క్ సేన్. ఆ త‌ర్వాత ఫ‌ల‌క్‌నామా దాస్ నుంచి దాస్ కా ధ‌మ్కీ వ‌ర‌కు భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు. యంగ్ ఏజ్‌లోనే నిర్మాత‌గానూ, ద‌ర్శ‌కుడిగానూ మ‌ల్టీటాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వ‌క్ సేన్…రీసెంట్‌గా అశోకవనంలో అర్జున కల్యాణం చిత్రంతో సక్సెస్‌ని అందుకున్నారు.

రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం 6న థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఆహాలో ఈనెల 27 నుంచి స్ట్రీమ్ కాబోతోంది.

విద్యా సాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ మరియు రితికా నాయక్ లు హీరోయిన్లుగా నటించారు. ఎస్ వీ సీ పీ బ్యానర్ పై బాపినీడు మరియు సుధీర్ ఈదర ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు.

- Advertisement -